ఎమ్మెల్యే రాజాసింగ్‌కు తప్పిన ప్రమాదం.. రోడ్డు మధ్యలో ఊడిపోయిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం‌ టైర్

MLA Rajasingh: గోషామహల్ MLA రాజాసింగ్‌కు పెను ప్రమాదం తృటిలో తప్పింది.

Arun Chilukuri
Published on: 9 Feb 2023 5:46 PM IST
MLA Raja Singh Escapes Danger After Bullet Proof Car Tyre Slips
X

ఎమ్మెల్యే రాజాసింగ్‌కు తప్పిన ప్రమాదం.. రోడ్డు మధ్యలో ఊడిపోయిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం‌ టైర్

MLA Rajasingh: గోషామహల్ MLA రాజాసింగ్‌కు పెను ప్రమాదం తృటిలో తప్పింది. రాజాసింగ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం టైర్ రోడ్డు మధ్యలో ఊడిపోయింది. ప్రమాదం సమయంలో కారు స్పీడ్ తక్కువగా ఉండటంతో రాజాసింగ్‌కు ఏం కాలేదు. అసెంబ్లీ నుంచి ఇంటికి వెళ్తుండగా.. ధూల్‌పేట ఎక్సైజ్ ఆఫీస్ ముందు ఈ ఘటన జరిగింది. అయితే తన భద్రతపై తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని రాజాసింగ్ ఆరోపిస్తున్నారు. తన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని మార్చాలని కోరినా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ఆయన విమర్శించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story