అంచనాలు తప్పని మిషన్‌ చాణక్య ఎగ్జిట్‌పోల్స్‌

అంచనాలు తప్పని మిషన్‌ చాణక్య ఎగ్జిట్‌పోల్స్‌
x
Highlights

ఎన్నికలు ఏవైనా... కౌంటింగ్‌ ముందు వచ్చే ఎగ్జిట్‌పోల్స్‌నే అందరు ఆసక్తిగా గమనిస్తుంటారు. అలా నిర్వహించిన సర్వే సంస్థలు ఇచ్చిన ఫలితాలు కొన్ని నిజమవుతాయి...

ఎన్నికలు ఏవైనా... కౌంటింగ్‌ ముందు వచ్చే ఎగ్జిట్‌పోల్స్‌నే అందరు ఆసక్తిగా గమనిస్తుంటారు. అలా నిర్వహించిన సర్వే సంస్థలు ఇచ్చిన ఫలితాలు కొన్ని నిజమవుతాయి మరికొన్ని తారుమారవుతాయ్. 2018లో తెలంగాణ అసెంబ్లీ, 2019 సాధారణ ఎన్నికలతో పాటు తాజాగా బీహార్‌ అసెంబ్లీ, దుబ్బాక ఉపఎన్నికల్లో హైదరాబాద్‌కు చెందిన మిషన్‌ చాణక్య సర్వే సంస్థ ఇచ్చిన ఫలితాలు నిజమవుతుండటంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అసలు మిషన్‌ చాణక్య ప్రజానాడి ఎలా పట్టగలుగుతుంది? దానికి ప్రామాణాకమేమిటి?

ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలపై ఎవరి అంచనాలు వారికుంటాయ్‌. అందులో కొన్ని నిజమవుతుండొచ్చు. మరికొన్ని తారుమారు అవుతుండొచ్చు. కానీ మిషన్‌ చాణక్య సర్వే ఫలితాలపై తెలుగు రాష్ట్రాల్లో చర్చలు జరుగుతున్నాయిప్పుడు. ఇటీవలి బీహార్‌ అసెంబ్లీకి తోడు, దుబ్బాక ఉపఎన్నికల్లో మిషన్‌ చాణక్య చెప్పినట్టే ఫలితాలు రావడాన్ని రాజకీయ వర్గాలతో పాటు ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలకు ఏమాత్రం తప్పకుండా మిషన్‌ చాణక్య సర్వే ఫలితాలు నిజాలయ్యాయని చెప్పుకుంటున్నారు.

బీహార్‌ అసెంబ్లీ ఫలితాలనే తీసుకుందాం. జాతీయ చానల్స్‌, జాతీయ సర్వే సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు తప్పాయి. మహా ఘట్‌ బంధన్‌గా మారిన ఆర్జేడీ, కాంగ్రెస్‌, వామపక్షాలు అతి పెద్ద పార్టీగా అవతరిస్తాయని జోస్యం చెప్పాయి. కానీ హైదరాబాద్‌కు చెందిన మిషన్‌ చాణక్య మాత్రం బీహార్‌లో రాబోయేది ఎన్డీయేనని, బీజేపీకి సీట్లు పెరుగుతాయని, జేడీయూకు సీట్లు తగ్గుతాయని పర్‌ఫెక్ట్‌గా అంచనా వేసింది. మొత్తంగా నితీష్‌ సారథ్యంలో ఎన్డీయే పక్షాలకే తిరుగులేని ఆధిక్యాన్ని కట్టబెట్టాయి.

మిషన్ చాణక్య... ఎన్డీయేకు 128+/4, మహా ఘట్‌బంధన్‌ యూపీయేకు 105+/4, ఇతరులు 10+/2 గెలుచుకుంటాయని తన ఎగ్జిట్‌పోల్స్‌ విడుదల చేసింది. నవంబరు 10వ తేదీన వచ్చిన ఫలితాల్లో సంఖ్యలు కాస్త అటు ఇటుగా వచ్చినా మిషన్‌ చాణక్య అంచనాలు మాత్రం తప్పలేదు. ఆ ఎన్నికల్లో ఎన్డీయేకు పార్టీకి 125 స్థానాలు దక్కగా మహా ఘట్‌బంధన్‌కు 110, ఇతరులకు 8 స్థానాలు దక్కాయి.

దుబ్బాక ఉపఎన్నిక విషయంలో కూడా మిషన్‌ చాణక్య తన అంచనాలను మరోసారి రుజువు చేసుకుంది. దుబ్బాకలో కారు పార్టీ జోరు తగ్గుతుందని, కమలం పార్టీ ఊపందుకుంటుందని, నెక్‌ టు నెక్‌ పోరులో చివరగా బీజేపీనే విజయం వరిస్తుందని కుండబద్దలు కొట్టింది. అనుకున్నట్టుగా బీజేపీ విజయం సాధించింది. టీఆర్‌ఎస్‌ రెండో స్థానానికి, కాంగ్రెస్‌ మూడో స్థానానికి పరిమితమైంది.

2019 మేలో జరిగిన సాధారణ ఎన్నికల్లో కూడా ఎన్డీయే కూటమికే పట్టం కట్టింది మిషన్‌ చాణక్య. ఏపీలో జగన్‌ పార్టీకే ఓటేసింది. హుజూర్‌నగర్‌ ఉపఎన్నికల్లో కూడా మిషన్‌ చాణక్య చెప్పిన ఫలితాలే వచ్చాయి. తాజాగా దుబ్బాక ఫలితం, బీహార్‌ ఫలితం కూడా అంచనాలు తప్పకుండా రావడంతో మిషన్‌ చాణక్య సర్వే గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories