జడ్చర్ల బస్టాండ్‌లో తప్పిన అగ్నిప్రమాదం.. మంచినూనెలో అంటుకున్న మంటలు

* పక్కనే ఉన్న సిలిండర్‌కు వ్యాపించిన మంటలు.. భయాందోళనకు గురైన ప్రయాణికులు

R Tripura Malini
Published on: 11 Dec 2022 11:56 AM IST
Missed Fire At Jadcherla Bus Stand
X

జడ్చర్ల బస్టాండ్‌లో తప్పిన అగ్నిప్రమాదం.. మంచినూనెలో అంటుకున్న మంటలు

MahbubNagar: నిత్యం వందలాది వాహనాలు, ప్రయాణికులతో రద్దీగా ఉండే బస్టాండ్‌లోని ఓ హోటల్లో క్షణాల్లో మంటలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఏం జరుగుతుందో తెలియక భయాందోళనకు గురయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల న్యూబస్టాండ్‌లోని హోటల్లో వంట చేస్తుండగా మంచినూనెలో మంటలు వ్యాపించాయి. మంటలు ఎక్కవ అయి సిలిండర్ పైపునకు వ్యాపించాయి. మంటలు క్షణాల్లో తీవ్రమవడంతో బస్టాండ్‌లోని ప్రయాణికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. హోటల్‌లో విద్యుత్తు సరఫరా నిలిపేశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పడంతో పెనుప్రమాదం తప్పింది.

కాగా అప్పటికే అగ్నిప్రమాదంతో హోటల్ పైకప్పు పూర్తిగా కాలిపోయింది. హోటల్ నిర్వాహకులు సేఫ్టీ ప్రికాషన్స్ పాటించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. హోటల్ నిర్వాహకులు మాత్రం తాము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, కొంతమేర ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story