లచ్చపేటలో మైనర్ ప్రేమికులు ఉరివేసుకొని ఆత్మహత్య.. ఇంట్లో వారికి తెలిస్తే విడదీస్తారనే భయంతో..
Siddipet: ఇరువురు ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు
లచ్చపేటలో మైనర్ ప్రేమికులు ఉరివేసుకొని ఆత్మహత్య.. ఇంట్లో వారికి తెలిస్తే విడదీస్తారనే భయంతో..
Siddipet: సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేటలో మైనర్ ప్రేమికులు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.లచ్చపేటకు చెందిన కూరపాటి భగీరథ అదే గ్రామానికి చెందిన తోట్ల నేహా దుబ్బాకలో ఇంటర్మీడియట్ చదువుకుంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఒకరినొకరు ఇష్టపడుతూ ప్రేమాయణం కొనసాగించారు. ఇంట్లో వారికి తెలిస్తే విడదీస్తారనే భయంతో భగీరథ ఇంట్లోనే ఎవరూ లేని సమయంలో ఇద్దరు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు ఉరి వేసుకుని విగత జీవులుగా మారడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. శనికావేశంలో మైనర్ ప్రేమికులు తీసుకున్న నిర్ణయం రెండు కుటుంబాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల పిర్యాదుతో కేసు నమోదు చేసిన దుబ్బాక పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.


