సిద్దిపేటలో పర్యటించిన కేటీఆర్, హరీష్‌రావు

Siddipet: పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశా

Dhatripriya
Published on: 15 Jun 2023 3:36 PM IST
Ministers KTR and Harish Rao visited Siddipet
X

సిద్దిపేటలో పర్యటించిన కేటీఆర్, హరీష్‌రావు

Siddipet: మంత్రులు హరీశ్‌ రావు, కేటీఆర్‌ సిద్దిపేటలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పట్టణ శివారు ఇర్కోడ్‌లో నూతనంగా నిర్మించిన మోడ్రన్‌ స్లాటర్‌ హౌస్‌ను, అందులో ఏర్పాటు చేసిన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మహిళా ఉత్పత్తులు, ఇర్కోడ్‌ నాన్‌వెజ్‌ పచ్చళ్లు, పంచాయతీరాజ్‌ శాఖ సేంద్రియ ఎరువుల స్టాళ్లను మంత్రులు ప్రారంభించారు. అనంతరం సిద్దిపేట జిల్లా కేంద్రానికి సమీపంలో నాగులబండ వద్ద నిర్మించిన ఐటీ టవర్‌ను మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్‌లు ప్రారంభించారు.

Dhatripriya

Dhatripriya

Next Story