GM Arun Kumar: రాష్ట్ర సర్కార్ అలసత్వంతోనే రెండో దశ ఎంఎంటీఎస్ పనులు ఆలస్యం

Minister Vaishnaw Video Conference On Railway Allocation In The Budget
x

GM Arun Kumar: రాష్ట్ర సర్కార్ అలసత్వంతోనే రెండో దశ ఎంఎంటీఎస్ పనులు ఆలస్యం

Highlights

GM Arun Kumar: బడ్జెట్‌లో రైల్వే కేటాయింపులపై మంత్రి వైష్ణవ్ వీడియో కాన్ఫరెన్స్‌

GM Arun Kumar: కేంద్ర బడ్జెట్‌లో రైల్వే కేటాయింపులపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సికింద్రాబాద్ రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. ఇటీవల జరిగిన రైల్వే ప్రమాదాలపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని రైల్వే జీఎం అరుణ్ కుమార్ తెలిపారు. ఎంఎంటీఎస్ రెండవ దశ పూర్తి అయిందని... త్వరలో మౌలాలి నుంచి సనత్ నగర్ వరకు సర్వీస్ ప్రారంభిస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంలో అలసత్వం వహించడంతోనే పనులు మందకొడిగా జరుగాయన్నారు. చెర్లపల్లి టెర్మినల్ పనులు సైతం వేగవంతం చేస్తున్నట్లు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories