Tummala: పామాయిల్ ఫ్యాక్టరీ పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల

Tummala: రైతు సంక్షేమ ధ్యేయంగా పని చేస్తాం

Jyothi
Published on: 4 Jan 2024 2:53 PM IST
Minister Tummala inspected the palm oil factory works
X

Tummala: పామాయిల్ ఫ్యాక్టరీ పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల

Tummala: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురం గ్రామ సమీపంలోని గోద్రెజ్ పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పరిశీలించారు.

లాలాపురం సమీపంలోని రైస్ మిల్లును పరిశీలించారు. అంజనాపురం గ్రామంలో నిర్మాణం చేపట్టే గోద్రెజ్ పామాయిల్ ఫ్యాక్టరీని తొమ్మిది నెలలలో పూర్తి చేయాలని కంపెనీ నిర్వాహకులను మంత్రి ఆదేశించారు. ఈ ప్రాంతంలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టడం రైతులకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. పామాయిల్ ఫ్యాక్టరీకి భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం తరఫున న్యాయం చేస్తామని తెలిపారు.

Jyothi

Jyothi

Next Story