Municipal Elections 2020: ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్

S. Srikanth
Updated on: 22 Jan 2020 4:49 PM IST
Municipal Elections 2020: ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

మహబూబ్ నగర్: ఓటర్లు ప్రగతికే పట్టం కడుతున్నారన్న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ మేరకు కుటుంబ సమేతంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ... ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు ప్రాణవాయువు లాంటిదని, ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

ఎవరైతే పట్టణ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నారో అలాంటి వారికే ఓటు వేయాలని ఆయన సూచించారు. పోలింగ్ ఇప్పటికే సంతృప్తికరంగా నమోదు కావడం... ఓటర్లు స్ఫూర్తిమంతంగా పోలింగ్ బూతులకు తరలి వస్తుండటం సంతోషంగా ఉందన్నారు. అభివృద్ధికి పట్టం కట్టాలని ఆయన మరోసారి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

S. Srikanth

S. Srikanth

Next Story