ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మహార్ధశ.. మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఆధునీకరణ

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మహార్ధశ.. మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఆధునీకరణ
Prashanth Reddy: ఆ పల్లె ఆసుపత్రులకు కార్పొరేట్ హంగులు సమకూరాయి.
Prashanth Reddy: ఆ పల్లె ఆసుపత్రులకు కార్పొరేట్ హంగులు సమకూరాయి. నిన్నటి వరకు కనీస వసతులకు నోచుకోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఇప్పుడు ఆక్సిజన్ పడకలు అందుబాటులోకి వచ్చాయి. మాతాశిశు సంరక్షణతో పాటు కోవిడ్ రోగులకు అత్యవసర చికిత్సకు అవసరమయ్యే విధంగా ఆధునీకరించారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మహార్ధశ పట్టుకుంది. మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఆయన మిత్రులు పల్లె దవాఖానాల ఆధునీకరణకు ముందుకొచ్చారు. మౌలిక వసతుల కల్పనకు 1.75 కోట్ల నిధులు విరాళంగా అందించారు. ఫలితంగా నియోజకవర్గంలోని 12 ఆసుపత్రులను కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా తీర్చిదిద్దారు. గతంలో అత్యవసర వైద్యానికి నిజామబాద్ కు పరుగులు పెట్టాల్సి వచ్చేదని ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఆధునిక వసతులతో పేదలకు కార్పొరేట్ వైద్యం అందే అవకాశం ఏర్పడిందని గ్రామస్ధులు చెబుతున్నారు.
నిజామాబాద్ జిల్లాపై కోవిడ్ సెకెండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపింది. పల్లె దవాఖానాల్లో అత్యవసర చికిత్సకు అవసరమైన సౌకర్యాలు లేక బాధితులు వైద్యం కోసం నిజామాబాద్, హైదరాబాద్ కు పరుగులు పెట్టారు. ఈ పరిస్థితి మళ్లీ తలెత్తకుండా గ్రామీణ వైద్యాన్ని బాగు చేయాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని తన స్నేహితుల సహకారంతో మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. పెరిగిన వసతులతో మెరుగైన వైద్యం అందిస్తామని వైద్యులు చెబుతున్నారు.
మంత్రి ప్రశాంత్ రెడ్డి చూపిన చొరవతో నియోజకవర్గంలోని ఆసుపత్రులు ఆధునిక హంగులతో కార్పొరేట్ ఆసుపత్రుల తరహాలో మారాయి. అన్ని నియోజకవర్గాల్లో ఈ తరహా మౌలిక వసతులు అందుబాటులోకి వస్తే ధర్ట్ వేవ్ వచ్చినా పల్లె ప్రజలకు బెంగ లేకుండా మెరుగైన వైద్యం అందనుంది.
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్‌కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఫ్లైబిగ్ విమానానికి తప్పిన ప్రమాదం
29 May 2022 7:45 AM GMTతెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఉష్ణోగ్రతలు.. 42 నుండి 44 డిగ్రీల...
29 May 2022 7:17 AM GMTప్రిన్సిపల్ Vs స్టాప్.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నల్గొండ...
29 May 2022 6:30 AM GMTనేటితో ముగియనున్న మంత్రుల సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర...
29 May 2022 6:09 AM GMTదేశంలో ముంచుకొస్తున్న బొగ్గు సంక్షోభం.. 4.25 కోట్ల టన్నుల బొగ్గు...
29 May 2022 5:55 AM GMT