Hyderabad: అలయ్ బలయ్‌లో కాంగ్రెస్, బీజేపీ నేతల పరస్పర కౌంటర్లు

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ‘అలయ్ బలయ్’ కార్యక్రమం నిర్వహించారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 13 Oct 2024 8:00 PM IST
Hyderabad: అలయ్ బలయ్‌లో కాంగ్రెస్, బీజేపీ నేతల పరస్పర కౌంటర్లు
X

Hyderabad: అలయ్ బలయ్‌లో కాంగ్రెస్, బీజేపీ నేతల పరస్పర కౌంటర్లు

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ‘అలయ్ బలయ్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాజకీయ నాయకుల భాషపై కీలక వ్యాఖ్యలు చేశారు. నాయకులు విమర్శించుకోవాలని, కానీ ప్రజలు అసహ్యించుకునేలా కాదన్నారు. నాయకులు మాట్లాడే తీరుతో పాటు భాషలోనూ మార్పు రావాలని ఆకాంక్షించారు.

ఎన్నికల సమయంలో ఘర్షణ పడొచ్చని, కానీ ఆ తర్వాత అంతా మర్చిపోయి ప్రజల శ్రేయస్సును కోరుకోవాలని సూచించారు. ప్రస్తుతం పార్టీలు విమర్శించుకుంటున్న తీరును చూసిప్రజలు అసహ్యించుకుంటున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాజకీయాల్లో భాష ముఖ్యమని, కానీ వేరేవాళ్లకు ఇబ్బంది కలిగించకూడదని చెప్పారు. కొందరు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, అలాంటి వారికి స్వీయ నియంత్రణ ఉండాలని బీజేపీ నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా మాట్లాడేలా దత్తాత్రేయ చొరవ చూపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story