కేంద్రమంత్రులు హర్దీప్, నిర్మలాకు తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ

కేంద్రమంత్రులు హర్దీప్, నిర్మలాకు తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ
x
Highlights

పురపాలక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలకు బడ్జెట్‌లో పెద్దఎత్తున నిధులు కేటాయించాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర...

పురపాలక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలకు బడ్జెట్‌లో పెద్దఎత్తున నిధులు కేటాయించాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర పట్టణ వ్యవహారాలు మరియు హౌసింగ్ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు లేఖ రాశారు. నగరాన్ని దీర్ఘకాలికంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నామన్న కేటీఆర్ హైదరాబాద్ అర్బన్ అగ్లోమరేశన్ ఏరియా పేరితో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు.

హైదరాబాద్ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని కాంప్రహెన్సివ్ సివరేజ్ మాస్టర్ ప్లానింగ్ దిశగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రక్క ప్రణాళికతో ముందుకు పోతుందన్న కేటీఆర్ ఈ మాస్టర్ ప్లాన్ కోసం ఇప్పటికే ప్రణాళిక, సర్వే, డిజైన్, అంచనాలు నిర్దారణ వంటి కార్యక్రమాలను ప్రభుత్వం పూర్తి చేసిందని చెప్పారు. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా మూడు ప్యాకేజీల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కాంప్రహెన్సివ్ సివరీజ్ మాస్టర్ ప్లాన్‌కి రానున్న బడ్జెట్లో కనీసం 20శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించాలని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories