KTR: తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమైన రోజు ఇది

KTR: ఒక నవశకానికి నాంది పలికిన రోజు

Jyothi
Published on: 29 Nov 2022 12:44 PM IST
Minister KTR Tweet on KCR Diksha Divas
X

KTR: తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమైన రోజు ఇది 

KTR Tweet: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా 13 ఏళ్ల క్రితం సరిగా ఇదే రోజు కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగారు. దీంతో ఆ రోజును టీఆర్ఎస్ శ్రేణులు దీక్షా దివస్‌గా పాటిస్తున్నాయి. అయితే ఆనాటి సంగతులను గుర్తు చేస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో ఓ పోస్టు చేశారు. కేసీఆర్ పోరాటం అనితర సాధ్యం అని అన్నారు. దీక్షా దివస్ తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమైన రోజు అని.. ఆ రోజు చరిత్రను మలుపు తిప్పిందని కేటీఆర్ పేర్కొన్నారు. 2009 నవంబర్ 29 ఒక నవశకానికి నాంది పలికి రోజని అన్నారు. ఒక బక్క పలుచని వీరుడు బందూకై తన జాతిని మేలు కొలిపిన రోజు.. తెలంగాణ వైపు దేశం దృష్టి మరల్చే విధంగా తెగించిన రోజు అని కేటీఆర్ ట్వీట్ చేశారు.


Jyothi

Jyothi

Next Story