KTR: కామారెడ్డి నియోజకవర్గంపై మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక నజర్‌

KTR: మధ్యాహ్నం దోమకొండ, బీబీపేట్‌ బూత్‌ కమిటీ సమావేశం

Shekhar G
Published on: 29 Oct 2023 5:16 PM IST
Minister KTR Special Focus On Kamareddy Constituency
X

KTR: కామారెడ్డి నియోజకవర్గంపై మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక నజర్‌

KTR: కామారెడ్డిలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది బీఆర్‌ఎస్‌. కామారెడ్డి నియోజకవర్గంపై మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక నజర్‌ పెట్టారు. కేసీఆర్‌ కామారెడ్డి నుంచి పోటీ చేస్తుండటంతో మంత్రి కేటీఆర్‌ ఆ నియోజకవర్గ ఇంచార్జ్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రతి ఓటర్‌ను కలిసేలా.. బూత్‌ కమిటీలను పటిష్టం చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా.. కామారెడ్డిలో రెండురోజులు పర్యటించనున్నారు కేటీఆర్‌. కేసీఆర్‌ భారీ మెజారిటీ కోసం పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయనున్నారు. నియోజకవర్గంలో మండలాల వారీగా బూత్‌ కమిటీలతో సమీక్షించనున్నారు.

ఈ నెల 31న మాచారెడ్డి, రామారెడ్డి మండలాల బూత్‌ కమిటీలతో కేటీఆర్‌ మీటింగ్‌ నిర్వహించనున్నారు. అలాగే.. మధ్యాహ్నం కామారెడ్డి అంగడి బజారులో టౌన్‌, కామారెడ్డి బూత్‌ కమిటీతో భేటీ అవుతారు. నవంబర్‌ 1న ఉదయం బిక్కనూరు, రాజాంపేట్‌ బూత్‌ కమిటీ మీటింగ్, మధ్యాహ్నం దోమకొండ, బీబీపేట్‌ బూత్‌ కమిటీలతో కేటీఆర్‌ సమావేశం కానున్నారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌ భారీ మెజార్టీతో గెలిచేందుకు.. అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు మంత్రి కేటీఆర్.

Shekhar G

Shekhar G

Next Story