గ్రేటర్ కార్పొరేటర్లపై కేటీఆర్‌ నిఘాకు కారణమేంటి?

గ్రేటర్ కార్పొరేటర్లపై కేటీఆర్‌ నిఘాకు కారణమేంటి?
x
Highlights

మీ కార్పొరేటర్ ఎలాంటి వారు? నిత్యం అందుబాటులో ఉంటున్నారా? కాలనీలో సమస్యలు ఉంటే ఎలా స్పందిస్తున్నారు? ఏమైనా అవినితి ఆరోపణలు ఉన్నాయా? కార్పొరేటర్...

మీ కార్పొరేటర్ ఎలాంటి వారు? నిత్యం అందుబాటులో ఉంటున్నారా? కాలనీలో సమస్యలు ఉంటే ఎలా స్పందిస్తున్నారు? ఏమైనా అవినితి ఆరోపణలు ఉన్నాయా? కార్పొరేటర్ కానప్పడు ఎక్కడ ఉండేవారు? ఇప్పడు కొత్త ఇల్లు కట్టుకున్నారా? ఒక్కటే హోం ఉందా లేక ఇంకా ఎక్కడైనా ఉన్నాయా? ఎన్ని కార్లు ఉన్నాయి? ఎలాంటి కార్లలో తిరుగుతుంటారు? ఏదైనా సమస్య పరిష్కారం కోసం వెళితే డబ్బులు డిమాండ్ చేసేవారా...ఏంటీ ఈ క్వశ్చన్స్ అనుకుంటున్నారా....కేటీఆర్‌ సీక్రెట్ టీం, ఇప్పుడు జీహెచ్‌ఎంసీలో ఇలాంటి ప్రశ్నలతో అన్వేషణ మొదలుపెట్టింది? ఎందుకు?

మరికొన్ని నెలల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి. గత గ్రేటర్ పోరులో టీఆర్ఎస్ తిరుగులేని విజయం సాధించింది. 150 కార్పొరేటర్లుకు కాను 99 కార్పొరేటర్లను గెలిపించుకుని చరిత్ర సృష్టించింది గులాబీ దళం. ప్రజలు పార్టీపై అంత నమ్మకం పెట్టుకుని ఇంతమంది కార్పొరేటర్లను గెలిపించినందుకు, వారికి మరింతగా సేవ చెయ్యాలని సీఎం కేసీఆర్‌తో పాటు కేటీఆర్‌ కూడా పిలుపునిచ్చారు. అయితే అప్పుడప్పుడు కొంతమంది కార్పొరేటర్లపై కూడా పలు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ కార్పొరేటర్లను కేటీఆర్ పిలిపించుకుని మందలించిన సందర్భాలూ చాలానే ఉన్నాయి.

అయితే వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో గ్రేటర్ ఎన్నికలు ఉండటంతో, ఇప్పుటి నుంచే దానికి సంబంధించిన కసరత్తు మొదలు పెట్టారు పార్టీ పెద్దలు. గతంలో ఎలాగైతే గెలిచామో, ఈసారి కూడా అంతకంటే అఖండ మెజారిటీ సాధించాలన్న పట్టుదలతో వున్నారు. దీంతో ఇప్పుడు టిఆర్ఎస్ కార్పొరేటర్ల పనితనం ఎలా ఉంది? ప్రజల్లో ఎలాంటి ఆదరణ ఉంది..? ప్రజలకు ఎలాంటి సేవ చేస్తున్నారు? మళ్లీ టికెట్ ఇస్తే గెలిచే సత్తా వుందా? ఎవరిపై ఎక్కువ ఆరోపణలున్నాయి? వంటి అంశాలపై గ్రౌండ్‌లెవల్‌ రియాల్టీ తెలుసుకునే పనిలో పడ్డారు కేటీఆర్. ఇందుకోసం సీక్రెట్ టీంను ఏర్పాటు చేసినట్లు సమచారం. ఈ టీం పని ఏంటంటే, ప్రతి డివిజన్‌లో మూడు, నాలుగు రోజులు తిరుగుతారు. అక్కడ ప్రజలతో మాట్లాడతారు. మీ కార్పొరేటర్ ఎలాంటి వారు? నిత్యం అందుబాటులో ఉంటున్నారా? కాలనీలో సమస్యలు ఉంటే ఎలా స్పందిస్తున్నారు? ఏమైనా అవినితి ఆరోపణలు ఉన్నాయా? కార్పొరేటర్ కానప్పడు ఎక్కడ ఉండేవారు? ఇల్లు ఎక్కడ ఉండేది? ఇప్పడు కొత్త ఇల్లు కట్టుకున్నారా? ఒక్కటే హోం ఉందా లేక ఇంకా ఎక్కడైనా ఉన్నాయా? ఎన్ని కార్లు ఉన్నాయి? ఎలాంటి కార్లలో తిరుగుతుంటారు? ఏదైనా సమస్య పరిష్కారం కోసం వెళితే డబ్బులు డిమాండ్ చేసేవారా అంటూ, కూలంకషంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారట.

ఇలా కార్పొరేటర్లందరిపై రహస్య బృందంతో నివేదికలు తెప్పించుకుంటున్నారట కేటీఆర్. ఏమాత్రం నెగెటివ్ రిపోర్ట్ వున్నా, ఆ కార్పొరేటర్‌‌కు నెక్ట్స్ ఎన్నికల్లో టికెట్‌ కష్టమట. కేటీఆర్‌ సర్వే పట్ల, కార్పొరేటర్లు టెన్షన్‌ పడిపోతున్నారట. తమ గురించి ఎలాంటి ఇన్‌పుట్స్ వెళ్తున్నాయోనని హైరానపడుతున్నారట. మొత్తానికి వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో తిరిగి తిరుగులేని విజయం సాధించేందుకు, గెలుపు గుర్రాల అన్వేషణలో వున్నారు కేటీఆర్. అందుకే పకడ్బందీగా సీక్రెట్ టీంతో క్షేత్రస్థాయిలో సర్వే చేయిస్తున్నారు. చూడాలి ఎంతమందికి తిరిగి టికెట్ వస్తుందో, ఎంతమందికి రాదో.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories