Hyderabad: ‌ దోమలగూడలో బ్రాహ్మణ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్

Hyderabad: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణిదేవికి మద్దతుగా మంత్రి ఎన్నికల ప్రచారం

Sandeep Eggoju
Updated on: 7 March 2021 2:58 PM IST
Minister KTR participating in the Brahmana Sammelan in Domalaguda
X

మంత్రి కేటీఆర్ (ఫైల్ ఇమేజ్)

Hyderabad: హైదరాబాద్‌ దోమలగూడలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి కేటీఆర్‌. బ్రాహ్మణ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన.. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్‌రావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని, దానిపై ఎప్పుడూ కేంద్రాన్ని ప్రశ్నించలేదే అని రాంచందర్‌రావును నిలదీశారు. గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, వాటిపై బీజేపీ నేతల గొంతు ఎందుకు పెగలడం లేదని మండిపడ్డారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టకపోగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేస్తుంటే కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడంలేదని దుయ్యబట్టారు మంత్రి కేటీఆర్‌.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story