KTR: మంత్రి కేటీఆర్‌తో సింగపూర్ హై కమిషనర్‌ సిమోన్ వాంగ్ భేటీ

KTR: రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను వివరించిన మంత్రి కేటీఆర్‌

Sandeep Eggoju
Updated on: 13 July 2021 6:01 PM IST
Minister KTR Meeting with Singapore High Commissioner Simon Wang
X
సింగపూరు హై కమిషనర్ తో మంత్రి కేటీఆర్ భేటీ

KTR: మంత్రి కేటీఆర్‌‌తో సింగపూర్ హై కమిషనర్ సిమోన్ వాంగ్‌ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడికి గల అవకాశాలను వివరించారు మంత్రి కేటీఆర్. అనేక రాష్ట్రాలతో పాటు వివిధ దేశాలకు చెందిన కంపెనీలు హైదరాబాద్‌లో ఉన్నాయన్న కేటీఆర్ టీఎస్ ఐపాస్, సింగిల్ విండో అనుమతులతో అంతర్జాతీయ పెట్టుబడులను తెలంగాణకు తీసుకురాగలిగిగామన్నారు. ఇక డిబిఎస్ వంటి కంపెనీలు ఇక్కడి వాతావరణం గురించి మంచి ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చాయన్న సింగపూర్‌ హై కమిషనర్ సిమోన్ రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను సింగపూర్‌ కంపెనీలకు పరిచయం చేయడంలో తోడ్పాటు అందిస్తామని తెలిపారు. అయితే సింగపూర్ కంపెనీలు ముందుకు వస్తే తెలంగాణలో ప్రత్యేకంగా జోన్ లేదా సింగపూర్ హబ్ ఏర్పాటు చేస్తామనే ప్రతిపాదన ముందుంచారు కేటీఆర్.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story