ఫార్మారంగంలో హైదరాబాద్‌కు తిరుగు లేదు: కేటీఆర్‌

Arun Chilukuri
Published on: 22 Feb 2021 4:36 PM IST
ఫార్మారంగంలో హైదరాబాద్‌కు తిరుగు లేదు: కేటీఆర్‌
X

ఫార్మారంగంలో హైదరాబాద్‌కు తిరుగు లేదు: కేటీఆర్‌

తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న బ‌యో ఏషియా -2021 స‌ద‌స్సును బేగంపేట ఐటీసీ కాక‌తీయ‌లో రాష్ర్ట ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు హైదరాబాద్ వైపు చూస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. కరోనా వ్యాక్సిన్ తయారీలో హైదరాబాద్ హబ్‌గా మారిందన్నారు. ఫార్మారంగంలో హైదరాబాద్‌కు తిరుగులేదన్న కేటీఆర్‌ పెట్టుబడులను ఆకర్షించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఈ ప్రారంభ కార్య‌క్ర‌మానికి ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ జ‌యేశ్ రంజ‌న్‌, ఫార్మా రంగ ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు. రెండు రోజుల పాటు వ‌ర్చువ‌ల్ విధానంలో ఈ స‌ద‌స్సు జ‌ర‌గ‌నుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story