ఇల్లు నేనే కట్టిస్తా.. పెళ్లి నేనే చేస్తా అని అన్నది సీఎం కేసీఆర్ మాత్రమే : మంత్రి కేటీఆర్

X
Highlights
ఇళ్లు నేనే కట్టిస్తా.. పెళ్లి నేనే చేస్తానంటున్న ఏకైక సీఎం కేసీఆర్ అని అన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌లో...
Arun Chilukuri26 Oct 2020 6:56 AM GMT
ఇళ్లు నేనే కట్టిస్తా.. పెళ్లి నేనే చేస్తానంటున్న ఏకైక సీఎం కేసీఆర్ అని అన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టిన ఆయన జియాగూడలో 840 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అని పెద్దలు సామెత చెబుతుంటారు. ఈ రెండు పనులు చేయడమంటే కష్టంతో కూడుకున్న పని. కానీ ఇల్లు నేనే కట్టిస్తా.. పెళ్లి నేనే చేస్తా అని అన్నది సీఎం కేసీఆర్ మాత్రమే అని స్పష్టం చేశారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పేదల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇళ్లు కట్టకుండానే కట్టినట్టు చూపించి డబ్బులు దండుకున్నారని మండిపడ్డారు. తల్లిదండ్రులకు పేదింటి ఆడబిడ్డ భారం కాకూడదనే కళ్యాణలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చామన్నారు కేటీఆర్.
Web TitleMinister KTR inaugurates double bedroom houses in Hyderabad
Next Story