బైరామల్‌గూడ ఫ్లైఓవర్‌ ప్రారంభం.. దేశంలోనే తొలిసారి..

బైరామల్‌గూడ ఫ్లైఓవర్‌ ప్రారంభం.. దేశంలోనే తొలిసారి..
x
Highlights

Minister KTR inaugurated Bairamalguda RHS flyover : హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది....

Minister KTR inaugurated Bairamalguda RHS flyover : హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. ఎల్‌బీ నగర్ బైరామల్‌గూడ జంక్షన్ వద్ద నిర్మించిన ఫ్ల్లైఓవర్‌ను సోమవారం పురపాలక శాఖమంత్రి కేటీ.రామారావు ప్రారంభించారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు(ఎస్ఆర్డీపీ)లో భాగంగా జీహెచ్ఎంసీ ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించింది. 780 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు ఉండే ఈ ఫ్లైఓవర్‌ను రూ.26.45 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించారు. దీంతో బైరామల్‌గూడ జంక్షన్‌, సాగర్‌ రింగ్‌రోడ్‌ జంక్షన్‌లో ట్రాఫిక్‌ ఇబ్బందులు తీరనున్నాయి.

దేశంలోనే మొదటిసారి 780 మీటర్ల పొడవుతో ప్రత్యేక టెక్నాలజీని ఈ నిర్మాణంలో వినియోగించినట్టు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఈ ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రావడం పట్ల స్థానికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, పలువురు అధికారులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories