Hyderabad: బిజినెస్ ఉమెన్ ఎక్స్ పో-2021ని ప్రారంభించిన కిషన్‌రెడ్డి

Hyderabad: ఆడవాళ్లు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు -కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

Sandeep Eggoju
Published on: 7 March 2021 1:32 PM IST
Minister Kishan Reddy Starts The Business Women Expo 2021
X

కిషన్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Hyderabad: కేంద్ర ప్రభుత్వం తరపున మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. హైదరాబాద్‌ హైటెక్స్‌లో బిజినెస్ ఉమెన్ ఎక్స్ పో - 2021 ని ప్రారంభించిన ఆయన మహిళలను గౌరవించే సంప్రదాయం భారతీయ సంస్కృతి అని అన్నారు. గత ఏడాది గణతంత్ర వేడుకల్లో మిలటరీకి నాయకత్వం వహించింది ఒక మహిళా కెప్టెన్ అని చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని, ఒలింపిక్స్‌లో మంచి పథకాలు సాధించి దేశానికి పేరు తీసుకొచ్చింది కూడా ఆడబిడ్డలేనని అన్నారు కిషన్‌రెడ్డి. ఆరేళ్లలో ఉజ్వల గ్యాస్ కనెక్షన్ల కింద 10 కోట్ల మంది మహిళలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని తెలియజేశారు.

మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాల కేసులపై త్వరితగతిన చర్యలు తీసుకునేలా చట్టాల్లో మార్పులు తీసుకొచ్చామన్నారు. హైదరాబాద్‌తో పాటు 8 నగరాల్లో సేఫ్ సిటీ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్నామని.. సీసీ కెమెరాలు, ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చామని అన్నారు కిషన్‌రెడ్డి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story