ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో మంత్రి జూపల్లి భేటీ

Telangana Politics: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 1 Aug 2024 11:48 AM IST
Minister Jupally Krishna Rao Meet MLA Krishna Mohan Reddy
X

ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో మంత్రి జూపల్లి భేటీ

Telangana Politics: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. పాత పరిచయాల కారణంగానే అసెంబ్లీ ప్రాంగణంలో కేటీఆర్ ను కలిశారని, ఎమ్మెల్యే పార్టీ మారుతున్నారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మసూదన్ రెడ్డి గద్వాలలోని ఎమ్మెల్యే బండ్లకృష్ణ మోహన్ రెడ్డి ఇంటికి చేరుకొని అల్పాహార విందులో పాల్గొన్నారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసం బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో పార్టీ చేరారన్నారు. పార్టీలో అంతర్గత విభేదాలు ఏవి లేవని.. ఎవైనా ఉన్నా తాము పరిష్కరించుకొని ముందుకు సాగుతామని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. రైతుల మేలు కోసం పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story