Jagadish Reddy: రేవంత్‌ పిండం వ్యాఖ్యలపై మంత్రి జగదీష్‌ రెడ్డి కౌంటర్‌

Jagadish Reddy: రేవంత్‌ పిండం వ్యాఖ్యలపై మంత్రి జగదీష్‌ రెడ్డి కౌంటర్‌

Arun Chilukuri
Published on: 9 Aug 2023 5:27 PM IST
Minister Jagdish Reddy Fired On Revanth Reddy
X

Jagadish Reddy: రేవంత్‌ పిండం వ్యాఖ్యలపై మంత్రి జగదీష్‌ రెడ్డి కౌంటర్‌

Jagadish Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై మంత్రి జగదీష్‌ రెడ్డి ఫైరయ్యారు. బీఆర్‌ఎస్‌ పాలనకు పిండం పెడతామంటూ రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి తప్పుబట్టారు. రాజకీయ కక్షలతో కేసీఆర్‌ ఏనాడు వ్యవహరించలేదని తెలిపారు. పిండాలు పెట్టి ప్రజలు హింసించిన చరిత్ర కాంగ్రెస్, టీడీపీలదేనని ఆరోపించారు. రేవంత్‌ ప్రజలకు పిండాలు పెట్టిన టీడీపీ, కాంగ్రెస్‌లకు చెందిన వాడే కాబట్టి.. పిండాల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్‌ లాంటి సంస్కార హీనున్ని కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీకి శాశ్వత శత్రువులు లేరని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story