Top
logo

తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వం : మంత్రి హరీశ్ రావు

తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వం : మంత్రి హరీశ్ రావు
X

Harish Rao

Highlights

కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా పార్లమెంటులో ప్రవేశపెట్టిన విద్యుత్ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని...

కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా పార్లమెంటులో ప్రవేశపెట్టిన విద్యుత్ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో బీజేపీ తెలంగాణ ప్రజల కోపానికి గురికాక తప్పదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. మంగళవారం సిద్దిపేట జిల్లాలోని దౌల్తాబాద్ మండలం మాచిన్ పల్లి గ్రామంలో సుమారుగా రూ.1.60 కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ ను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దౌల్తాబాద్ ప్రాంత రైతుల మేలు కోసం దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఎంతో ఆలోచన చేశారని ఆయన తెలిపారు. అవినీతికి ఆస్కారం లేకుండా కొత్త రెవెన్యూ చట్టం తెచ్చి రైతులకు, పేదలకు సీఎం కేసీఆర్ మరింత దగ్గరయ్యారని మంత్రి వెల్లడించారు.

తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రైతులకు 24 గంటలు ఉచితంగా కరెంటు సరఫరా చేస్తున్నదని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. రైతుల కోసం రైతుబంధు, రైతు బీమాతో పాటు ఎన్నో రైతు సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ చేపట్టారని హరీశ్ రావు పేర్కొన్నారు. రైతుల బోరు బావులకు మీటర్లు పెట్టాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చెబుతున్నదని ఆయన అన్నారు. దుబ్బాక ప్రజలను బీజేపీ నాయకులు ఓటు అడగాలంటే వారు రైతుల బోరు బావుల మీటర్లకై పార్లమెంటులో పెట్టిన బిల్లు ఉపసంహరణ చేసుకోవాలని మంత్రి సూచించారు. అనంతరం రూ.1.10కోట్ల రూపాయల వ్యయంతో సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ దౌల్తాబాద్ మండలంలోని మల్లేశంపల్లి గ్రామంలో నిర్మించనున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంతో మంత్రి హరీశ్ రావుతో పాటు, సర్పంచ్ లు యాదమ్మ, సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్ వేలేటి రోజాశర్మ, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ, విద్యుత్ శాఖ ఏస్ఈ కరుణాకర్ బాబు, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గ, మండలాల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Web TitleMinister Harish Rao wants the decision taken by the central government to be reversed
Next Story