శాసనసభకు హాజరైన మంత్రి హరీష్‌రావు

X
Highlights
తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్‌రావు శాసనసభకు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యే ముందు...
Arun Chilukuri14 Sep 2020 5:20 AM GMT
తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్‌రావు శాసనసభకు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యే ముందు రోజు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ రావడంతో ఇన్నాళ్లు ఆయన హోంఐసోలేషన్‌లో ఉండిపోయారు. తాజాగా నిర్వహించి పరీక్షలో ఆయనకు నెగెటివ్ అని తేలింది. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్‌రావు సోమవారం శాసనసభ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఇక మిగతా ఎమ్మెల్యేందరూ కూడా కొవిడ్-19 టెస్టులు చేయించుకున్నందుకు స్పీకర్ వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. టెస్టులు చేయించుకోని ఎమ్మెల్యేలు ఎవరైనా తప్పనిసరిగా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. ప్రతి సభ్యుడు కొవిడ్ నిబంధనలు చేపట్టాలని సభ్యులను స్పీకర్ కోరారు.
Web TitleMinister Harish Rao attended to assembly
Next Story