తనకు తాను రూ.50 లక్షల జరిమాన విధించుకున్న మంత్రి హరీష్‌రావు

admin1
Updated on: 2 Nov 2019 9:07 PM IST
harish rao TRS
X
harish rao TRS

మంత్రి హరీశ్‌ రావు.. తనకు తాను 50 లక్షలు జరిమానాగా విధించుకున్నారు. మహిళలకు మెప్మా రుణాలు, చెత్తబుట్టల పంపిణీ కోసం ఉదయం పదకొండున్నర గంటలకు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మంత్రి హరీశ్‌ సభ ఖరారైంది. అయితే సభాస్థలికి చేరుకునే సరికి మధ్యాహ్నం మూడున్నర అయింది. అప్పటిదాకా వేచి చూస్తున్న మహిళలకు హరీశ్‌ క్షమాపణలు చెప్పారు. పరిహారంగా తనకు జరిమానా విధించాలని వారిని కోరారు. దీంతో తమకు మహిళా భవనం కోసం నిధులను మంజూరు చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. మంత్రి సరేనన్నారు. మహిళా భవన నిర్మాణానికి 50 లక్షలను మంజూరు చేయిస్తానని వారికి హామీ ఇచ్చారు.

admin1

admin1

Next Story