Harish Rao: కిషన్‌ రెడ్డి గురువు కిరణ్‌ కుమార్‌ రెడ్డి.. చంద్రబాబు శిష్యుడు రేవంత్‌ రెడ్డి

Harish Rao: 3 రైతు వ్యతిరేక చట్టాలతో బీజేపీ, 3 గంటల కరెంట్‌తో కాంగ్రెస్‌..

Shekhar G
Published on: 29 July 2023 12:29 PM IST
Minister Harish Rao Comments On Revanth Reddy And Kishan Reddy
X

Harish Rao: కిషన్‌ రెడ్డి గురువు కిరణ్‌ కుమార్‌ రెడ్డి.. చంద్రబాబు శిష్యుడు రేవంత్‌ రెడ్డి

Harish Rao: కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబులు తెలంగాణ ద్రోహులంటూ మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి చంద్రబాబు గురువు అన్నారు. తెలంగాణను అడ్డుకున్న కిరణ్‌కుమార్‌రెడ్డి కిషన్‌రెడ్డికి గురువు ఎద్దేవా చేశారు. తెలంగాణ బీజేపీ నాయకులు కిరణ్‌కుమార్‌రెడ్డి కాళ్ల దగ్గర.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వనని కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. మూడు రైతు వ్యతిరేక చట్టాలతో బీజేపీ, 3 గంటల కరెంట్‌తో కాంగ్రెస్‌.. తెలంగాణ రైతులకు శాపంగా మారాయని చెప్పారు. తెలంగాణ ద్రోహులను బీజేపీ, కాంగ్రెస్‌ మళ్లీ తీసుకొస్తున్నాయని హరీశ్ దుయ్యబట్టారు.

Shekhar G

Shekhar G

Next Story