ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ బాబ్జీకి మంత్రి హరీష్ రావు అభినందనలు

ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ బాబ్జీకి మంత్రి హరీష్ రావు అభినందనలు
x
Highlights

భాగ్యనగరం ట్రాఫిక్‌ గురించి నగర ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే ఎమర్జెన్సీ వాహనాలకు సైతం సైడ్‌ ఇవ్వలేని పరిస్థితి నెలకొంటుంది. తాజాగా.. అలాంటి ఘటనే హైదరాబాద్‌ మొజంజాహి మార్కెట్‌ దగ్గర చోటుచేసుకుంది.

భాగ్యనగరం ట్రాఫిక్‌ గురించి నగర ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే ఎమర్జెన్సీ వాహనాలకు సైతం సైడ్‌ ఇవ్వలేని పరిస్థితి నెలకొంటుంది. తాజాగా.. అలాంటి ఘటనే హైదరాబాద్‌ మొజంజాహి మార్కెట్‌ దగ్గర చోటుచేసుకుంది. కోఠి వైపు వెళ్తున్న ఓ అంబులెన్స్‌ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్ బాబ్జి.. అంబులెన్స్‌ ముందు పరుగులు పెడుతూ.. అది ముందుకు వెళ్లేందుకు లైన్‌ క్లియర్‌ చేశాడు.

మంత్రులు, ఉన్నతాధికారుల నుంచి అభినందనలు అందుకుంటున్నాడు బాబ్జీ.. అందులో భాగంగానే తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ట్విటర్‌ వేదికగా బాబ్జీని అభినందించారు."మానవత్వం పరిమళించే మంచి మనుషుల్ని చూసినప్పుడు గొప్ప సంతోషం కలుగుతుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిన కాపాడటం కోసం హైదరాబాద్ అబిడ్స్ లో కానిస్టేబుల్ బాబ్జీ పడిన తపన చూసినప్పుడు అంతే సంతోషం వేసింది" అంటూ ట్వీట్ చేశారు హరీష్ రావు..


Show Full Article
Print Article
Next Story
More Stories