Fever Hospital DMO moved to NIIMS: డాక్టర్‌ సుల్తానాను నిమ్స్‌కు తరలింపు

Fever Hospital DMO moved to NIIMS: డాక్టర్‌ సుల్తానాను నిమ్స్‌కు తరలింపు
x
Highlights

Fever Hospital DMO moved to NIIMS: చాదర్‌ఘాట్‌లోని తుంబే ఆస్పత్రి వైద్య సిబ్బంధిని బిల్లుల విషయంలో ఫీవర్‌ ఆస్పత్రి డీఎంవో డాక్టర్‌ సుల్తానా ప్రశ్నించడంతో ఆమెను ఆస్పత్రి సిబ్బంది నిర్బంధించిన విషయం తెలిసిందే.

Fever Hospital DMO moved to NIIMS: చాదర్‌ఘాట్‌ లోని తుంబే ఆస్పత్రి వైద్య సిబ్బంధిని బిల్లుల విషయంలో ఫీవర్‌ ఆస్పత్రి డీఎంవో డాక్టర్‌ సుల్తానా ప్రశ్నించడంతో ఆమెను ఆస్పత్రి సిబ్బంది నిర్బంధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె ఓ సెల్ఫీ వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఆ వీడియోను చూసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పందించారు. వెంటనే ఆమెకు నిమ్స్‌లో ఆమెకు ఉచితంగా వైద్యం అందించాలని ఆదివారం ఆదేశాలు జారీ చేసారు. దీంతో ఫీవర్‌ ఆస్పత్రి డీఎంవో డాక్టర్‌ సుల్తానాను చికిత్స నిమిత్తం నిమ్స్‌కు తరలించారు.

కాగా కరోనా లక్షణాలతో డాక్టర్‌ సుల్తానా నిన్న (శనివారం) చాదర్‌ఘాట్‌లోని తుంబే ఆస్పత్రిలో చేరారు. అయితే చికిత్స పేరుతో తుంబే ఆస్పత్రి యాజమాన్యం 24 గంటలకు రూ.లక్షా 15 వేలు బిల్లు వేసింది. ఈ బిల్లులపై ఫీవర్‌ ఆస్పత్రి డీఎంవో డాక్టర్‌ సుల్తానా ప్రశ్నించడంతో ఆమెను తుంబే ఆస్పత్రి సిబ్బంది నిర్బంధించారు. కరోనా లక్షణాలతో డీఎంవో వైద్యం కోసం తుంబే ఆస్పత్రిలో చేరగా తనకు 24 గంటల్లో లక్షా 15 వేల బిల్లు వేశారని, అధి ప్రశ్నించడంతో ఆమెను నిర్భిందించారని ఆమె సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.

కరోనా విజృంభిస్తున్న సమయంలో అందరికీ సేవలందించి ఫ్రంట్‌లైన్‌ వారియర్‌గా సేవలందించిన తన పట్ల తుంబే ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సుల్తానా ఆరోపించారు. బిల్లులు అధికంగా వేస్తున్నారని ఆమె ప్రశ్నించడంతో సమయానికి సరైన వైద్య సేవలందించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా కరోనా మహమ్మారి బారినపడ్డారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. కాగా ఆమె కుటుంబసభ్యులు తుంబే ఆస్పత్రి యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క రోజుకే ఇంత బిల్లులు వేశారని విమర్శించారు. సుల్తానాను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఆమెకు మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, తుంబే ఆస్పత్రి గుర్తింపును రద్దు చేయాలని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories