వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల సమీక్ష

admin1
Published on: 15 Feb 2020 8:00 PM IST
వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల సమీక్ష
X

గాంధీ ఆసుపత్రిలో జరిగిన సంఘటనలు ఎంత మాత్రం ఆహ్వానించదగినవి కాదన్నారు మంత్రి ఈటల రాజేందర్. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల సమీక్ష నిర్వహించారు. గాంధీలో జరగుతున్న పరిణామాలు, ఆరోగ్య శాఖకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. వ్యక్తుల కంటే వ్యవస్థ ముఖ్యమన్నారు. గాంధీలో జరుగుతున్న వాటిపై విచారణ నిర్వహించి.. నిజానిజాలు వెలికి తీసి బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని ఈటల తెలిపారు. ఇక నుంచి సూపరింటెండెంట్‌కు అటెండెన్స్ వెసులుబాటు కల్పించే అధికారాలు ఉండవన్నారు. ఆసుపత్రిపై నమ్మకం పోయేలా డాక్టర్లు ప్రవర్తించవద్దని ఈటల తెలిపారు. మరోవైపు డీఎంఈ, సూపరింటెండెంట్‌లపై ఇప్పటికే డాక్టర్ వసంత్ ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఈటెల నిర్వహించిన సమీక్షకు డీఎంఈ హాజరుకాలేదు. గాంధీ వివాదంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో వైద్య వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

admin1

admin1

Next Story