Congress: గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ కీలక నేతల సమావేశం

Congress: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కొనసాగుతున్న సమావేశం

Shekhar G
Published on: 5 Aug 2023 2:59 PM IST
Meeting Of Congress Key Leaders At Gandhi Bhavan
X

Congress: గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ కీలక నేతల సమావేశం

Congress: గాంధీ భవన్‌లో తెలంగాణ పార్లమెంట్ పరిశీలకులతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సి వేణుగోపాల్ సమావేశం అయ్యారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు దీప దాస్ మూన్షి, ఏఐసీసీ కార్యదర్శులు శ్రీధర్ బాబు, రోహిత్ చౌదరీ, విశ్వనాత్, మన్సూర్ అలీ ఖాన్, వంశీ చంద్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంపత్ కుమార్, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ, ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్ దామోదర్ రాజా నర్సింహ, వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన పార్లమెంట్ పరిశీలకులు పాల్గొన్నారు. ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ నియోజకవర్గల్లో వ్యవహరించాల్సిన తీరు పై కేసి వేణుగోపాల్ దిశా నిర్దేశం చేయనున్నారు. ఎన్నికల వ్యూహాలు, పార్టీ ప్రచారం, గ్యారెంటీ స్కీమ్స్ ను ప్రజల్లోకి తీసుకెళ్లడం, సభలు సమావేశాలపై చర్చించనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story