Telangana: తెలంగాణ కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు

Telangana: ఇవాళ కాంగ్రెస్‌ గూటికి కేకే, కడియం కుటుంబసభ్యులు

Jyothi
Updated on: 30 March 2024 9:16 AM IST
Massive Joins to Telangana Congress
X

Telangana: తెలంగాణ కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు

Telangana: తెలంగాణ కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. ఇవాళ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు కేకే, కడియం కుటుంబసభ్యులు. సీఎం రేవంత్‌రెడ్డి నివాసంలో కాంగ్రెస్‌ గూటికి చేరనున్నారు కె.కేశవరావు, కడియం శ్రీహరి. పార్టీ కండువా కప్పి వారిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. తండ్రులతోపాటు వారి కుమార్తెలు కూడా కాంగ్రెస్‌లో చేరనున్నారు. హస్తం కండువా కప్పుకోనున్నారు మేయర్‌ విజయలక్ష్మి, కడియం కావ్య. ఇదిలా ఉంటే.. సాయంత్రం కేకేతో పాటు కడియం ఇంటికి సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లనున్నారు.

Jyothi

Jyothi

Next Story