Breaking News: ములుగు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. 40 ఇళ్లు దగ్ధం..

Fire Accident: ములుగు జిల్లా మండపేట మండలం శనిగకుంటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Arun Chilukuri
Published on: 28 April 2022 9:24 PM IST
Breaking News: ములుగు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. 40 ఇళ్లు దగ్ధం..
X

Breaking News: ములుగు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. 40 ఇళ్లు దగ్ధం..

Fire Accident: ములుగు జిల్లా మండపేట మండలం శనిగకుంటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిప్రమాదంలో దాదాపు 40 ఇళ్లు దగ్ధమయ్యాయి. వరుసగా గ్యాస్‌ సిలిండర్లు పేలుతుండటంతో మంటలు అదుపులోకి రావడం లేదు. ఈ ప్రమాదంతో 40 గిరిజన కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఊరంతా మంటలు అంటుకోవడంతో గిరిజన ప్రజలు భయంతో చంటి పిల్లలతో సహా పరుగుల తీశారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story