జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీలోకి భారీగా చేరికలు

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీలోకి భారీగా చేరికలు
x
Highlights

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీలోకి భారీగా చేరికలు ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు నేతలు బీజేపీ వైపు చూస్తున్నట్లు జోరుగా...

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీలోకి భారీగా చేరికలు ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు నేతలు బీజేపీ వైపు చూస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన బండ కార్తీకరెడ్డి రేపు బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌‌ ఆధ్వర్యంలో ఆమె బీజేపీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.

అటు జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో బీజేపీ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల అభ్యర్థులపై చర్చిస్తున్నారు. సమావేశంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, చింతల పాల్గొన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి లిస్ట్‌పై తుది కసరత్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories