Marri Shashidhar Reddy: కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకింది.. నయం చేయలేని స్థితికి చేరుకుంది

Marri Shashidhar Reddy: ఒక హోంగార్డు కాంగ్రెస్ నుంచి పోతే పోయేదేమీలేదు

Jyothi
Updated on: 19 Nov 2022 3:17 PM IST
Marri Shashidhar Reddy Sensational Comments On Congress
X

Marri Shashidhar Reddy: కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకింది.. నయం చేయలేని స్థితికి చేరుకుంది

Marri Shashidhar Reddy: చిట్‌చాట్‌లో మర్రి శశిధర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్‌ను ఎదుర్కొనే పరిస్థితిలో కాంగ్రెస్‌ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని.. నయం చేయలేని స్థితికి కాంగ్రెస్ పార్టీకి చేరుకుందన్నారు. ఒక హోంగార్డు కాంగ్రెస్ నుంచి పోతే పోయేదేమీలేదని.. రేవంత్‌రెడ్డి వ్యవహారశైలి సరిగ్గా లేదని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికలో 10 కోట్లు ఖర్చు పెడతానని చెప్పి.. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు. ఇన్‌ఛార్జులతో డబ్బు ఖర్చు పెట్టించి.. వారిని డొల్ల చేశారని.. ఖర్చు పెట్టకపోతే టికెట్లు, పదవులు ఇవ్వనని బెదిరించాడన్నారు. ఇక కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ అందుబాటులో ఉండడని.. చెంచాగాళ్లను పెట్టి పార్టీని నడిపిస్తున్నాడని విమర్శించారు. తనలాగే చాలా మంది పార్టీని వీడే అవకాశం ఉందని.. వచ్చే ఎన్నికల్లో 15 మందిని గెలిపించుకొని.. సొంత దుకాణం చూసుకోవాలని రేవంత్ భావిస్తున్నారని ఆరోపించారు.

Jyothi

Jyothi

Next Story