Maoists Surrender: కరోనా భయంతో వరుసగా లొంగిపోతున్న మావోయిస్టులు

Maoists Surrendering: లొంగిపోయిన మావోయిస్టులు కువకొండ ఏరియా కమిటీ సభ్యులుగా గుర్తింపు

Arun Chilukuri
Updated on: 15 May 2021 5:35 PM IST
Maoists
X

 Maoists (file ఫోటో)

Maoists Surrender: చత్తీస్ ఘడ్ లో కరోనా భయంతో మావోయిస్టులు వరుసగా పొలీసులకు లొంగిపోతున్నారు. కాంకేర్ జిల్లా కోయిలబెడలో ఇద్దరు మావోయిస్టులు లొంగిపోగా..దంతేవాడ జిల్లా కువ్వకొండ పీఎస్ లో ఐదుగురు మావోయిస్టులు లొంగిపోయారు. వీరికి కరోనా పరీక్షలు జరిపించారు పోలీసులు. హంగారాం అనే మావోయిస్టుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. లొంగిపోయిన మావోయిస్టులు కువకొండ ఏరియా కమిటీ సభ్యులుగా కొనసాగుతున్నారు. దంతేవాడ జిల్లాలో పలు విధ్వంసకర ఘటనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికైనా మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి రావాలని పోలీసులు పిలుపునిచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story