Manda Krishna Madiga: సీఎం రేవంత్‌రెడ్డిపై మంద కృష్ణ మాదిగ మండిపాటు

Manda Krishna Madiga: ఈ నెల 9వ తేదీన అన్ని జిల్లాల్లో నల్ల జెండాలతో నిరసన చేస్తాం

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 3 Oct 2024 5:55 PM IST
Manda Krishna Madiga anger against CM Revanth Reddy
X

Manda Krishna Madiga: సీఎం రేవంత్‌రెడ్డిపై మంద కృష్ణ మాదిగ మండిపాటు

Manda Krishna Madiga: ఎస్సీ వర్గీకరణ అమలు విషయంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు MRPS అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ. ఎస్సీ వర్గీకరణ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని సుప్రీంకోర్టు చెప్పినా ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు.

సుప్రీం తీర్పు అనంతరం పంజాబ్, తమిళనాడు ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తుందని తెలిపారు. అధిష్టానం ఒత్తిడి ఓ వైపు, రాష్ట్రంలోని మాలల ఒత్తిడితోనే వర్గీకరణ అమల్లో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. వర్గీకరణ అమలులో జాప్యాన్ని నిరసిస్తూ ఈ నెల 9వ తేదీన అన్ని జిల్లాల్లో నల్ల జెండాలతో నిరసన చేపడతామని తెలిపారు మంద కృష్ణ.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story