మంచిర్యాల జిల్లా గుడిపల్లి సజీవదహనం కేసు.. పెట్రోల్‌తో ఆరుగురిని ఆహుతి చేశారు

Mancherial: బంకులో పెట్రోల్‌ కొనుగోలు చేస్తున్న సీసీ ఫుటేజ్‌ దృశ్యాలు,.

Jyothi
Updated on: 19 Dec 2022 1:28 PM IST
Mancherial Six Burnt Alive In Fire Accident Case Updates
X

మంచిర్యాల జిల్లా గుడిపల్లి సజీవదహనం కేసు.. పెట్రోల్‌తో ఆరుగురిని ఆహుతి చేశారు

Mancherial: మంచిర్యాల జిల్లా గుడిపల్లి సజీవదహనం కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు బంకులో పెట్రోల్‌ కొనుగోలు చేస్తున్న సీసీ ఫుటేజ్‌ దృశ్యాలు, కాల్‌డేటా ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నారు. శాంతయ్య భార్య సృజన ప్రధాన సూత్రధారిగా గుర్తించిన పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. శాంతయ్య భార్య సృజన, కూతురు మౌనిక, సృజన సోదరుడు, లక్సెట్టిపేటకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి లక్ష్మణ్‌, ఆటో డ్రైవర్‌, గుడిపల్లికి చెందిన మరో వ్యక్తితో పాటు గోదావరిఖనికి చెందిన కానిస్టేబుల్‌ను అరెస్ట్‌ చేశారు. భార్యాభర్తల మధ్య ఆర్థిక గొడవలే సజీవదహనానికి కారణమంటున్న పోలీసులు ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story