Mancherial: మందుబాబులకు రిమ్మ దిగిపోయే శిక్ష విధించిన కోర్టు.. ఆస్పత్రిని 2 రోజుల పాటు..

Mancherial: మంచిర్యాలలో మందుబాబులకు విధించిన శిక్ష చర్చనీయాంశంగా మారింది.

Arun Chilukuri
Updated on: 22 Jan 2023 7:45 PM IST
Mancherial Court Punished Drinkers to Clean Hospital
X

Mancherial: మందుబాబులకు రిమ్మ దిగిపోయే శిక్ష విధించిన కోర్టు.. ఆస్పత్రిని 2 రోజుల పాటు..

Mancherial: మంచిర్యాలలో మందుబాబులకు విధించిన శిక్ష చర్చనీయాంశంగా మారింది. మంచిర్యాల జిల్లా పరిధిలో ఒకే రోజు 13 మందిపై డ్రంకన్‌ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. వారిని మంచిర్యాల ఫస్ట్ క్లాస్ కోర్టులో హాజరుపరిచారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆస్పత్రినీ రెండు రోజుల పాటు శుభ్రపరచాలని ఆదేశించింది. అలా చేయని పక్షంలో 10 రోజుల జైలు శిక్ష విధించారు. దీంతో మొదటి రోజు మంచిర్యాల పోలీసులు 13 మంది మందుబాబులను ఆస్పత్రి వద్దకు తీసుకువచ్చి పారిశుద్ధ్య పనులు చేయించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story