Man Suicide in Chandrayanagutta: అక్కలను హతమార్చిన ఉన్మాది ఆత్మహత్య

Man Suicide in Chandrayanagutta:చాంద్రాయణగుట్ట డబుల్ ముర్డర్ కేసులో నిందితుడు గా ఉన్న ఇస్మాయిల్ ఆత్మహత్య కు పాల్పడ్డాడు.

Arun Chilukuri
Published on: 2 July 2020 12:18 PM IST
Man Suicide in Chandrayanagutta: అక్కలను హతమార్చిన ఉన్మాది ఆత్మహత్య
X

Man Suicide in Chandrayanagutta: చాంద్రాయణగుట్ట డబుల్ ముర్డర్ కేసులో నిందితుడు గా ఉన్న ఇస్మాయిల్ ఆత్మహత్య కు పాల్పడ్డాడు. ఇస్మాయిల్ రెండు రోజులు క్రితం తన ఇంట్లో ముగ్గురు అక్కల పై కత్తితో దాడి చేయగా వారిలో ఇద్దరు మృతి చెందగా, ఒకరు పరిస్థితి విషమమంగా వుంది. వారితో పాటుగానే అడ్డువచ్చిన బావను కూడా కత్తి పొడిచి గాయ పరిచి రెండు రోజులుగా పోలీసులు కు దొరకకుండా తప్పించుకొని తి రుగుతున్నడు. పోలీసులు పలుచోట్ల గాలించారు. నిందితుడి ఇంటి వెనక ద్విచక్ర వాహనం నిలిపి ఉందని బుధవారం స్థానికులు సమాచారమివ్వడంతో ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్‌ మజీద్‌, చాంద్రాయణగుట్ట ఇన్‌స్పెక్టర్‌ రుద్రభాస్కర్‌ ఇస్మాయిల్‌ ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా అతని మృతదేహం కనిపించింది. పూర్తిగా కుళ్లిపోయి ఉంది. దీంతో హత్య చేసిన రోజు రాత్రే (సోమవారం) ఇంట్లోకి ప్రవేశించి ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు భావిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story