Kamareddy: బ్యాంక్ అధికారుల కళ్లుగప్పి రూ.50వేలతో ఉడాయించిన దుండగుడు

Kamareddy: ఏటీఎం మిషన్ బాగుచేస్తానని నమ్మబలికిన కేటుగాడు

Dhatripriya
Published on: 2 April 2023 11:24 AM IST
Man Robbered 50 Thousand From Private Bank
X

Kamareddy: బ్యాంక్ అధికారుల కళ్లుగప్పి రూ.50వేలతో ఉడాయించిన దుండగుడు

Kamareddy: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ కేటుగాడు... ప్రైవేట్ బ్యాంక్ అధికారులకే టోకరా వేసి కుచ్చుటోపీ పెట్టాడు. ఏటీఎం మిషన్ రిపేర్ చేస్తానని నమ్మబలికి యాక్సిస్ బ్యాంక్ అధికారుల కళ్లుగప్పి.. 50 వేల రూపాయలతో ఉడాయించాడు. గుర్తు తెలియని వ్యక్తిని బ్యాంకర్స్ ఎలా నమ్మి.. అంత డబ్బిచ్చారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Dhatripriya

Dhatripriya

Next Story