ఐదుగురు మహిళలతో వివాహం.. హైదరాబాద్ పోలీసులకు చిక్కిన నిత్య పెళ్లి కొడుకు

Hyderabad: అతడు ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాడు.

Arun Chilukuri
Published on: 5 July 2021 4:28 PM IST
Man held for Multiple Marriages in Hyderabad
X

ఐదుగురు మహిళలతో వివాహం.. హైదరాబాద్ పోలీసులకు చిక్కిన నిత్య పెళ్లి కొడుకు

Hyderabad: అతడు ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాడు. పేరుకు ఉద్యోగం సెర్చింగ్ కానీ, అతడిలో మాత్రం మరో కన్నింగ్ ఆలోచనలు ఉండేవి. ఒకరికి తెలియకుండా మరోకరితో ప్రేమ వ్యవహారం నడిపేవాడు. అలా ఆరుగురు మహిళలను మోసం చేశాడు. పెళ్లి అయి విడాకులు తీసుకున్న మహిళలను టార్గెట్ చేసి ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసిన రంగస్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అనంతపురం జిల్లాకు చెందిన రంగస్వామి ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. ఉద్యోగం దొరకక పోవడంతో చైన్ స్నాచింగ్, యువతులను వేధింపులకు గురి చేయడం లాంటి పనులు చేసేవాడు. దాంతో కొంతమంది యువతుల ఫిర్యాదుతో జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అయినా అతడిలో మార్పు రాలేదు. మరో కన్నింగ్ ఆలోచనలకు తెరతీశాడు. పెళ్లి అయి విడాకులు తీసుకున్న మహిళలను టార్గెట్ చేస్తూ పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడ్డాడు. మహిళలను పెళ్లి చేసుకుని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి ఎంజాయ్ చేసేవాడు.

అయితే రంగస్వామి వ్యవహారంపై అనుమానం వచ్చిన ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో అతడి వ్యవహారం బయటపడింది. అంతేకాదు పోలీసులను ఆశ్రయించిన విషయం తెలుసుకున్న రంగస్వామి గోవాకు పారిపోయాడు. అక్కడ కూడా అమ్మాయిలను మోసాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు రంగస్వామి ఎట్టకేలకు నిత్య పెళ్లికొడుకు రంగస్వామిని హైదరాబాద్ పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. రంగస్వామికి మరో వీక్ నెస్ కూడా ఉంది ఆడవాళ్లలా తయారవడం, ఆడవాళ్లలా మాట్లాడటం ఆ వేష ధారణలో ఉండటం ఇష్టపడతాడు మొత్తానికి పోలీసుల ఎంట్రీతో నిత్య పెళ్లికొడుకు ఆట కట్టయింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story