ACB Raids: లంచం తీసుకుంటూ దొరికిపోయిన నేత.. రూ.5 లక్షలు తగలబెట్టి..!

Man Fires Five Lakhs Rupees of Notes After Identifies ACB Raids
x

ACB Raids: లంచం తీసుకుంటూ దొరికిపోయిన నేత.. రూ.5 లక్షలు తగలబెట్టి..!

Highlights

ACB Raids: చేసింది వెదవ పని. పైగా దొరికిపోతాననే భయం ఒకటి. ఆ భయంతోనే లక్షలాది డబ్బును మంటల్లో తలగబెట్టే ప్రయత్నం చేశాడు ఓ అవినీతి పరుడు.

ACB Raids: చేసింది వెదవ పని. పైగా దొరికిపోతాననే భయం ఒకటి. ఆ భయంతోనే లక్షలాది డబ్బును మంటల్లో తలగబెట్టే ప్రయత్నం చేశాడు ఓ అవినీతి పరుడు. కాదు, కాదు, మాజీ వైస్‌ ఎంపీపీ. నలుగురికి మంచి చేయాల్సిన బాధ్యత గల పదవిలో ఉండి ఆ పదవికే నల్లటి మచ్చ తీసుకొచ్చాడు. అందరిలో అభాసుపాలైయ్యాడు.

హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ తహసీల్దార్‌ సైదులు నివాసంలో సోదాలు చేపట్టారు. క్రషర్‌ అనుమతి కోసం ఓ వ్యక్తి నుంచి 6 లక్షలు డిమాండ్ చేశాడు సైదులు‌. అయితే సైదులు స్థానంలో 5 లక్షలు లంచం తీసుకున్నాడు మాజీ వైస్‌ ఎంపీపీ వెంకటయ్యగౌడ్‌. ఇక అదే సమయంలో ఏసీబీ అధికారులు రావడంతో 5 లక్షలకు నిప్పు పెట్టాడు వెంకటయ్య గౌడ్‌. మంటలను ఆర్పిన అధికారులు వెంకటయ్య గౌడ్‌ను విచారిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories