Hyderabad: షటిల్‌ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి

Man dies during badminton match at Uppal in Hyderabad
x

Hyderabad: షటిల్‌ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి

Highlights

Hyderabad: హైదరాబాద్‌లోని నాగోల్ ప్రాంతంలో షటిల్ ఆడుతుండగా ఓ యువకుడు గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషాద సంఘటన చోటుచేసుకుంది.

Hyderabad: హైదరాబాద్‌లోని నాగోల్ ప్రాంతంలో షటిల్ ఆడుతుండగా ఓ యువకుడు గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషాద సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, 25 ఏళ్ల గుండ్ల రాకేశ్‌ అనే యువకుడు నాగోల్‌లో షటిల్ ఆడుతుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు.

అతనితో ఉన్న సహచరులు వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రాకేశ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడిని ఖమ్మం జిల్లా తల్లాడకు చెందినవాడిగా గుర్తించారు.

ఆరోగ్యంగా కనిపించిన యువకుడు అకస్మాత్తుగా మరణించడంతో కుటుంబసభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.


Show Full Article
Print Article
Next Story
More Stories