Hyderabad: చందానగర్ యువకుడి మృతి కేసులో కీలక మలుపు

Hyderabad: హైదరాబాద్ చందానగర్ యువకుడి మృతి కేసు కీలక మలుపు తిరిగింది. యువకుడే బిల్డింగ్ కిటికీలో నుంచి పడిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 22 Oct 2024 6:15 PM IST
Man Dies After Jumping from Hotel in Hyderabad
X

Hyderabad: చందానగర్ యువకుడి మృతి కేసులో కీలక మలుపు

Hyderabad: హైదరాబాద్ చందానగర్ యువకుడి మృతి కేసు కీలక మలుపు తిరిగింది. యువకుడే బిల్డింగ్ కిటికీలో నుంచి పడిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. కుక్కతో ఆడుకుంటూ... హోటల్ కిటికిలో నుంచి ఉదయ్ అనే యువకుడు పడిపోయాడు. ఈ ఘటన చందానగర్‌లోని వీవీ హోటల్‌లో జరిగింది. స్నేహితుడి బర్త్ డే పార్టీని హోటల్‌లో చేసుకున్న ఉదయ్... మధ్యలో బయటకు వెళ్లాడు.

అక్కడే ఉన్న కుక్కతో ఆడుకుండూ... అదుపు తప్పి మూడో అంతస్తు నుంచి పడిపోయాడు ఉదయ్. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకోగా సోమవారం రాత్రి వరకు బయటకు తెలియకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు... కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story