సెల్లార్‌లో చిక్కుకొని హైకోర్టు ఉద్యోగి మృతి

సెల్లార్‌లో చిక్కుకొని హైకోర్టు ఉద్యోగి మృతి
x
Highlights

హైదరాబాద్ మహానగరంలో శుక్రవారం కురిసిన భారీ వర్షాలకు ఓ వ్యక్తి మృతి చెందారు. ఈ విషాదసంఘటన నగరంలోని ముషీరాబాద్ ప్రాంతంలో చోటు చేసుకుంది. హైదరాబాద్...

హైదరాబాద్ మహానగరంలో శుక్రవారం కురిసిన భారీ వర్షాలకు ఓ వ్యక్తి మృతి చెందారు. ఈ విషాదసంఘటన నగరంలోని ముషీరాబాద్ ప్రాంతంలో చోటు చేసుకుంది. హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాలకి రోడ్లు, లోతట్టు ప్రాంతాలు, సెల్లార్లన్నీ జలమయం అయ్యాయి. ఈ క్రమంలోనే ముషీరాబాద్ కేర్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న శ్రీ సాయి అపార్ట్మెంట్లో కూడా భారీగా వరద నీరు చేరింది. దీంతో అపార్ట్ మెంట్ సెల్లార్ చెరువును తలపించింది. దీంతో సెల్లర్ లో చిక్కుకొని 54 ఏండ్ల వ్యక్తి మృతి చెందారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే హైకోర్టు లో పనిచేసే బి రాజ్ కుమార్ (54 ) నిన్న రాత్రి 7:30 ప్రాంతంలో స్పెన్సర్ షాపింగ్ మాల్ కి వెళ్తా అని కుటుంబ సభ్యలతో చెప్పి కిందికి దిగారు. సెల్లార్ లో భారీగా వరద నీరుచేరడంతో ఆ వ్యక్తి అక్కడే చిక్కుకుని ప్రమాదవశాత్తు మృతి ‌ చెందాడు. అయితే సెల్లార్‌లో వాన నీరు చేరి విద్యుత్ షాక్‌కు గురై రాజ్ కుమార్ మృతిచెందినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే మృతుని కుమారుడు ముషిరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజ్ కుమార్ కరెంట్ షాక్‌తో చనిపోయారా ? లేదా ఇంకా ఏదైనా ప్రమాదం జరిగిందా అనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదే విధంగ నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బాలికతో సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌ 17న జరిగిన ప్రమాదంలో నేరెడ్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కాకతీయ నగర్‌లో నివాసముండే 12 ఏళ్ల సుమేధ సైకిల్‌ తొక్కుకుంటూ బయటికెళ్లి ప్రమాదవశాత్తూ ఓపెన్‌ నాలాలో పడిపోవడంతో ప్రాణాలు విడిచింది. అదే విధంగా గత నెల 20న కురిసిన భారీ వర్షానికి సరూర్‌నగర్‌ చెరువులో పడి ఒకరు మృతి చెందారు. ఇక హైదరాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి 8 గంటల వరకు భారీ వర్షాలు కురిశాయి. సుమారు 15.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షపు నీరు ట్రాఫిక్ ప్రవాహానికి అంతరాయం కలిగించడంతో లోతట్టు ప్రాంతాలు, రోడ్లు మునిగిపోయాయి.Show Full Article
Print Article
Next Story
More Stories