Top
logo

Weather updates : తెలంగాణలో మరో రెండు రోజులు వానలు

Weather updates : తెలంగాణలో మరో రెండు రోజులు వానలు
X
Highlights

Weather updates : తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ...

Weather updates : తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం ఒడిశా, దక్షిణ కోస్తా పరి‌సర ప్రాంతాల్లో 5.8 కిలో‌మీ‌టర్ల ఎత్తు‌వ‌రకు ఉప‌రి‌తల ఆవ‌ర్తనం కొన‌సా‌గు‌తు‌న్నది. అయితే అది అక్టో‌బర్‌ తొమ్మి‌దిన ఉత్తర అండ‌మాన్‌, తూర్పు మధ్య బంగా‌ళా‌ఖాతం ప్రాంతంలో అల్ప‌పీ‌డ‌నంగా మారే అవ‌కాశం ఉందని సమాచారం. తదు‌పరి 24 గంటల్లో వాయ‌వ్య‌ది‌శగా ప్రయా‌ణించి మధ్య బంగా‌ళా‌ఖా‌తంలో వాయు‌గుం‌డంగా మారే సూచ‌న‌లు‌న్నాయి.

వీటి ప్రభావంతో అల్పపీడనం ప్రభావంతో బుధ, గురు‌వా‌రాల్లో రాష్ట్ర‌వ్యా‌ప్తంగా ఉరు‌ములు, మెరు‌పు‌లతో కూడిన తేలి‌క‌పాటి వానలు కురిసే అవ‌కాశం ఉన్న‌దని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం అధి‌కారి రాజా‌రావు తెలి‌పారు. ముఖ్యంగా రాష్ట్రంలోని కుమ్రంభీం ఆసి‌ఫా‌బాద్‌, మంచి‌ర్యాల, పెద్ద‌పల్లి, వరం‌గల్‌ అర్బన్‌, వరం‌గల్‌ రూరల్‌, ములుగు, మహ‌బూ‌బా‌బాద్‌, భద్రాద్రి కొత్త‌గూడెం, కరీం‌న‌గర్‌, జయ‌శం‌కర్‌ భూపా‌ల‌పల్లి, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని సమాచారం.

ఇక ఈ ఏడాది కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలో నదులు, చెరువులు, కుంటలు అన్ని నిండు కుండలను తలపిస్తున్నాయి. ఓ వైపు రైతులు ఈ ఏడాది నీరు సంవృద్దిగా ఉండడంతో పంటలు పండించడానికి ఎలాంటి నీటి కొరతా ఉండదని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Web TitleWeather Updates Heavy rain Fall may occur in Telangana Due to Cyclone Effect
Next Story