Weather Updates : తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు

Weather Updates : తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు
x
Highlights

Weather Updates : గత రెండు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇదే క్రమంలో మరో మూడు రోజుల పాటు...

Weather Updates : గత రెండు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇదే క్రమంలో మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలో ఆదివారం అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని, అదే విధంగా సోమ, మంగళ, బుధవారాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఛత్తీస్‌గఢ్ నుంచి కర్ణాటక వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 3.1 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంలో తీవ్రత ఎక్కువగా గ్రేటర్‌ పరిధిలోనే ఉందని, అందుకే ఈ నెలలో ఆ ప్రాంతంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయని తెలిపారు. మరో 20 రోజుల్లో నైరుతి రుతుపవనాలు నిష్క్రమించనున్నప్పటికీ రెండు ఉపరితల ద్రోణుల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయని తెలిపారు.

ఇక శుక్రవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జనగావ్, రంగా రెడ్డి, సిద్దిపేట, వరంగల్, సూర్యపేట, మహబూబ్‌నగర్‌లలో భారీ వర్షాలు కురిశాయి. ఖమ్మంలో కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొరలుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయి. అలా కాకుండా ఉండేందుకు 2,480 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడానికి చెర్లా మండలంలోని తాలిపెరు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు వద్ద నీటిపారుదల అధికారులు రెండు గేట్లను ఎత్తారు. కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో కూడా తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసాయి. వర్షం కారణంగా పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతినడంతో రైతులకు నష్టం వాటిల్లింది. అనేక చోట్ల కురిసిన వర్షాల కారణంగా స్థానిక చెరువులు, కుంటలు నిండిపోయాయి. నీటిపారుదల ప్రాజెక్టులైన శ్రీపాద యల్లంపల్లి, కొమురం భీం, ర్యాలీ వాగు, నీల్వాయ్ ప్రాజెక్టులకు భారీగా ప్రవాహం వచ్చాయి.

హైదరాబాద్‌ వాతావరణ కేంద్ర అధికారిక లెక్కల ప్రకారం జూన్‌ 1 నుంచి శనివారం వరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 742.1 మిల్లీమీటర్లు నమోదయింది. 23 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదవగా, 8 జిల్లాల్లో సాధారణ వర్షపాతం రికార్డయింది. ఇకపోతే రాష్ట్రంలో పదేళల్లో ఎప్పుడూ కురవనంత వర్షాలు కురిసి రికార్డును బద్దల కొట్టాయి. ఇప్పటివరకు దాదాపు 46 శాతం అధిక వర్షపాతం నమోదైంది. 2010లో 32 శాతం అధిక వర్షపాతం రికార్డయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories