మెదక్ జిల్లా కుకునూర్ లో సెల్ టవర్ ఎక్కి వ్యక్తి హల్ చల్

* భార్య పట్టించుకోవడం లేదని పోలీసులకు ఫిర్యాదు * పోలీసులు కూడా పట్టించుకోలేదని నిరసన * పురుగుల మందు తీసుకుని టవర్ ఎక్కిన దేవేందర్ రెడ్డి * భార్యతో కలిసుండేలా చూడాలని దేవేందర్ డిమాండ్

Neeta Gurnale
Updated on: 1 Jan 2021 1:38 PM IST
మెదక్ జిల్లా కుకునూర్ లో సెల్ టవర్ ఎక్కి వ్యక్తి హల్ చల్
X

భార్య తనకు పట్టించుకోవడం లేదని సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేసాడు ఓ వ్యక్తి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుకునూర్ గ్రామానికి చెందిన దేవేందర్ రెడ్డి తన భార్య లాక్ డౌన్ సమయంలో తన కుమార్తె ఇంటికి వెళ్లి అక్కడే ఉంటూ తనను పట్టించుకోవడం లేదని పోలీస్ కంప్లయింట్ ఇచ్చాడు. ఐతే, పోలీసులు దీనిని సీరియస్ గా తీసుకొని పట్టించుకోలేదని నిరసన వ్యక్తం చేస్తూ పురుగుల మందు పట్టుకొని సెల్ టవర్ ఎక్కాడు. తను తన భార్యతో కలిసి ఉండేలా చూడాలని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసాడు.


Neeta Gurnale

Neeta Gurnale

Next Story