Mallu Bhatti Vikramarka: వైరాలో మధిర కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు

Mallu Bhatti Vikramarka: భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు

Shekhar G
Published on: 9 Nov 2023 2:51 PM IST
Madhira Congress Candidate Bhatti Vikramarka Special Pooja In Vaira
X

Mallu Bhatti Vikramarka: వైరాలో మధిర కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు

Mallu Bhatti Vikramarka: మధిర కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైరాలోని అయ్యప్పస్వామి, స్నానాల లక్ష్మీపురంలోని శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయాల్లో నామినేషన్ పత్రాలతో భట్టి దంపతులు పూజలు చేశారు. వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాలోతు రాందాస్ నాయక్ భట్టి దంపతులతో ప్రత్యేక పూజలు చేయించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైరాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం పలికారు.

Shekhar G

Shekhar G

Next Story