హైదరాబాద్ ఐఐటీ చౌకైన కరోనా కిట్!

హైదరాబాద్ లోని ఐఐటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) ఓ సరికొత్త టెస్టింగ్ కిట్ అభివృద్ధి చేసింది.

Samba Siva Rao
Updated on: 7 Jun 2020 11:21 AM IST
హైదరాబాద్ ఐఐటీ చౌకైన కరోనా కిట్!
X

హైదరాబాద్ లోని ఐఐటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) ఓ సరికొత్త టెస్టింగ్ కిట్ అభివృద్ధి చేసింది. ఈ టెస్టింగ్ కిట్ ద్వారా శరీరంలో కరోనా వైరస్ ఉంటే పసికట్టవచ్చని తెలిపింది. తక్కువ ఖర్చుతో దీనిని రూపొందించినట్ల వారు తెలిపారు. ఈ కిట్ ద్వారా కరోనా పరీక్ష చేస్తే కేవలం 20 నిమిషాల్లోనే ఫలితం తెలిసిపోతుందని, ఆర్టీ-పీసీఆర్ (రివర్స్ ట్రాన్స్ క్రిప్షన్ పాలీమెర్స్ చైన్ రియాక్షన్)కు ప్రత్యామ్నాయ విధానమని ఐఐటీ రీసెర్చర్లు వెల్లడించారు.

తక్కువకే తయారు చేసిన కేవలం ఈ కిట్ 550 రూపాయలేనని తెలిపింది. ఐసీఎంఆర్ అనుమతుల కోసం వేచి చూస్తున్నామని, ఐసీఎంఆర్ అనుమతులు లభిస్తే భారీ ఎత్తున కిట్లను తయారు చేస్తామని ఐఐటీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ శివ్ గోవింద్ సింగ్ తెలియజేశారు. ఈ కిట్లు ఎక్కువ మొత్తంలో తయారు చేస్తే 350 రూపాయలకే అందించవచ్చని రీసెర్చర్లు వెల్లడించారు. టెస్టింగ్ కిట్లకు సంబంధించిన పరీక్షలకు ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీలో పరీక్షించామని, ఈ కిట్ల ద్వారా చేసిన టెస్టులు విజయవంతం అయ్యాయని ఐఐటీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ శివ్ గోవింద్ సింగ్ తెలిపారు.

"కరోనా వైరస్ టెస్టింగ్ కిట్ చాలా సులువుగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఏ సమయంలోనైనా వినియోగించవచ్చు. ఇది ప్రస్తుతమున్న టెస్టుల విధానాలకు ప్రత్యామ్నాయం. కొవిడ్-19 జీనోమ్ ను ఇది సులువుగా కనుగొంటుంది" అని శివ్ గోవింద్ సింగ్ తెలిపారు. కాగా, కరోనా వైరస్ కు టెస్టింగ్ కిట్ ను అభివృద్ధి చేసిన రెండో భారత ఐఐటీ తెలంగాణకు చెందినది కావడం గమనార్హం.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story